శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (20:08 IST)

సీఎం జగన్‌పై కరాటే కళ్యాణి ఫైర్.. బీజేపీలో చేరుతానని క్లారిటీ.. (video)

తిరుమల డిక్లరేషన్ వివాదం ఇటీవల ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా డిక్లరేషన్ వివాదాన్ని తెరపైకి తెచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ నటి కరాటే కల్యాణి. తిరుమల డిక్లరేషన్ విషయంలో వైఎస్ జగన్‌ తప్పు చేశారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం.. కావొచ్చు పీఎం కావొచ్చు కాని.. ఎవరికైనా తిరుమల రూల్స్‌ని బ్రేక్ చేసే హక్కులేదని స్పష్టం చేశారు. 
 
భారత పౌరురాలిగా ప్రశ్నించడం తన హక్కు అంటూ సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు కల్యాణి. ''సీఎం జగన్ క్రిస్టియన్ అని అందరికీ తెలుసు. ఆయన సీఎం అయినందున ఎవరూ ఆపరని తిరుమలకి వెళ్లారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రూల్‌ని బ్రేక్ చేయడం తప్పు. అది ఎవరైనా కావచ్చు. సీఎం అవ్వొచ్చు. పీఎం కావొచ్చు. డిక్లరేషన్ ఇచ్చి గుడిలోకి అడుగుపెట్టాలి. నా ఇష్టం నేను వెళ్తా అంటే ప్రజలకు ఏం సందేశం అని? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అన్ని మతాలను గౌరవించాలి.'' అని కరాటే కల్యాణి అన్నారు. 
ys jagan - thirunamam
 
ఇక త్వరలోనే తాను బీజేపీలో చేరతానని కరాటే కల్యాణి ప్రకటించారు. పార్టీలో చేరిన తర్వాత.. అన్ని అంశాలపై స్పందిస్తానని స్పష్టం చేశారు. జెరూసలేంకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ అడిగితే ఇస్తారు కదా.. మరి తిరుమలలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
 
వైఎస్ జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా చేయడం తప్పని విమర్శించారు కల్యాణి. ఏపీలో దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మీ దేవుళ్ల జోలికి మేం రావడం లేదని.. మా దేవుళ్ల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న కరాటే కల్యాణి రెండు వారాల పాటు హౌస్‌లో ఉన్నారు. తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.