గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (15:17 IST)

కరాటే కళ్యాణికి ఎంత కష్టమొచ్చింది.. ఉదయాన్నే వేధింపులు..

పొద్దున లేవగానే ఆ నటికి వేధింపులు అధికమవుతున్నాయి. కృష్ణ సినిమాలో బ్రహ్మిని బాబీ అంటూ ప్రేమగా  పిలిచే క్యారెక్టర్‌లో కనిపించి అలరించిన కరాటే కళ్యాణి గురించే. ఈమె.. మిరపకాయ్ సినిమాలో రవితేజతో కలిసి నటించింది. అయితే ప్రస్తుతం ఆమెకు వేధింపులు తప్పలేదు. పొద్దున్నే లేవగానే అశ్లీల వీడియోలు, అసభ్య పదజాలంతో దూషణలు వస్తున్నాయట. 
 
ఈ వేధింపుల్ని తట్టుకోలేక.. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించింది. ఫోనుల్లో వేధింపులు ఎక్కువైపోతున్నాయని.. ఉదయాన్నే ఈ వేధింపుల కారణంగా ఫోన్ చూడాలంటేనే భయమేస్తుందని ఆమె వాపోయింది. కొన్ని నెంబర్లను బ్లాక్ చేసినా.. ఇతర ఫోన్ నెంబర్ల నుంచి వీడియోలను పంపుతున్నారని... వాటిని చూసేందుకే అభ్యంతరకరంగా వున్నాయని వివరించింది. 
 
తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని.. కొన్నింటిలో తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారంటూ  కరాటే కళ్యాణి తెలిపింది. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను అభ్యర్థించింది. అయితే ఈ వేధింపులకు కారణముందని సినీ పండితులు అంటున్నారు. గతంలో సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. 
 
క్రైస్తవ సంఘాల ప్రతినిధుల పేరుతో కొన్ని రోజుల నుంచి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారని.. దానిపై రియాక్ట్ కావడమే ఇందుకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ కేసును సైబర్ క్రైమ్ ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి.