హైదరాబాద్‌లో 3.75 కోట్ల నగదు స్వాధీనం...

hawala money
ఠాగూర్| Last Updated: బుధవారం, 16 సెప్టెంబరు 2020 (08:35 IST)
హైదరాబాద్ నగరంలో 3.75 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా హవాలా మనీగా గుర్తించారు. భాగ్యనగరంలో జరుగుతున్న హవాలా రాకెట్‌కు సంబంధించిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ ప్రాంతంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వీరంతా హవాలా మార్గాల్లో నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా రూ.3.75 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ నలుగురు వ్యక్తులు ముంబైకి చెందిన ఓ సంస్థలో పనిచేస్తున్నట్టు తేలింది. ఆ సంస్థ యజమాని అహ్మదాబాద్‌కు చెందినవాడిగా తెలిసింది.

హైదరాబాదులో బ్రాంచి ఏర్పాటు చేసి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. కాగా స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :