శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (14:00 IST)

హైదరాబాద్‌లో వ్యాపారం బాగుందట... మకాం మార్చనున్న పాయల్!!

ఒక్క చిత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి పాయల్ రాజ్‌పుత్. ఈ పంజాబీ ముద్దుగుమ్మ నటించిన తొలి చిత్రం "ఆర్ఎక్స్100" మూవీలో అందాలను హద్దేలేకుండా ప్రదర్శించింది. దీంతో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పుట్టిపెరిగిన స్థలంతో పేరు లేకుండా బహుబాషా చిత్రాల్లో నటిస్తూ అదరగొడుతోంది. 
 
వృత్తి రీత్యా షూటింగుల్లో పాల్గొనాల్సి వచ్చిన‌పుడు తాత్కాలికంగా అద్దెకు ఉండాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. దీంతో అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో సొంతంగా ఇళ్లు కొనుగోలు చేసుకుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల‌కు చెక్ పెట్టేందుకు టాలీవుడ్ న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్ ప్లాన్ చేసుకుంటుంద‌ట‌.
 
ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కూడా బిజీ కావ‌‌డంతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ముంబై నుంచి త‌న మ‌కాంను హైద‌రాబాద్‌కు మార్చానుకుంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. హైద‌రాబాద్‌లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి.. కుటుంబాన్ని సిటీకి తీసుకురావాల‌ని ఫిక్స్ అయింద‌ట‌.
 
త‌న‌కు అభిరుచుల‌కు అనుగుణంగా ఉండే ఫ్లాట్‌ను వెతికే ప‌నిలో ఉన్న‌ట్టు టాక్‌. ఇప్ప‌టికే అందాల తార‌లు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, రాశీ ఖ‌న్నాలు తమ బడ్జెట్‌కు అనుకూలంగా గృహాలను కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. వీరిద్దరితో పాయల్ కూడా జతకలవనుంది.