బెల్లీ ఫ్యాట్ కరిగించే రసం.. ఇలా తీసుకుంటే?

juice
juice
సెల్వి| Last Updated: సోమవారం, 1 జూన్ 2020 (13:19 IST)
గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చుంటూ.. శారీరక శ్రమ లేకపోవడం కారణంగా పొట్టను పెంచుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అందుకే బెల్లీని కరిగించుకునేందుకు నిమ్మరసం తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జ్యూస్‌లు, టీలపై డైట్ పెడితే.. బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందట.

ఉదయాన్నే లేచిందే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండి నిమ్మరసాన్ని కలిపి తాగాలి. ఆ తరువాత పది గంటలకు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్‌ను లేక ఆపిల్ జ్యూస్‌ను తాగాలి. 12 గంటలకు ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. మధ్యాహ్నం 1 గంటకు చల్లటి ఉన్న నీరు ఒక గ్లాసు తీసుకుని.. ఆ తరువాత క్యారెట్ జ్యూస్ ఒక గ్లాస్ తాగాలి. ఇవి తీసుకుంటూ ఒక కప్పు మాత్రమే అన్నం తీసుకోవాలి.

భోజనంలో కూరగాయలు తీసుకోవాలి. రాత్రి పది గంటలకు మళ్ళీ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకుని నిమ్మరసం తాగాలి. అయితే తాగే జ్యూస్‌ల్లో షుగర్ కలపకూడదని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. ఇలా చేస్తే పొట్టలోని బెల్లీ ఫ్యాట్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇలా వారంరోజులు చేస్తే ఈజీగా బెల్లి ఫ్యాట్ కరగడం మీరే గమనించవచ్చునని వారు సెలవిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :