మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (19:22 IST)

వేసవి కాలంలో తాటిముంజలు ఎందుకు తీసుకోవాలంటే? (Video)

వేసవి కాలంలో వేసవి తాపాన్ని తొలగించే విధంగా ఆహారం తీసుకోవాలి. శరీరానికి నీటి శాతం అధికంగా వుండే పండ్లను తీసుకోవాలి. అలాంటి వాటిల్లో పుచ్చకాయ, దోసకాయలు ముందుంటాయి. అదేవిధంగా ఎండాకాలంలో తాటిముంజలు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం ముంజల్లో ఎక్కువగా ఉంటుంది. 
 
తాటి ముంజల్లో విటమిన్ ఎ, బి, సి,ఐరన్ జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలున్నాయి. ఇవి శరీరంలోని ట్యాక్సిన్లను తొలగిస్తాయి. అలాగే బరువు కూడా సులభంగా తగ్గిపోతుంది. తాటి ముంజలను రోజు ఒక కప్పు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
 
ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. గర్భిణీలు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. అందం పరంగా కూడా ముంజలు బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.