బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జులై 2020 (13:04 IST)

నాలుగు ఫ్లాట్లు అయినా బిచ్చమెత్తుకునేది.. చివరికి కోడలి చేతిలో..?

ఆస్తి కోసం ముంబైలో దారుణం చోటుచేసుకుంది. నాలుగు ఫ్లాట్లకు ఓనర్ అయినా బిచ్చబెత్తుకుని బతికింది. కానీ కోడలు ఆస్తి కోసం 70 ఏళ్ల అత్త సంజనను హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. ముంబై చెంబూర్‌లోని పెస్టం సాగర్ కాలనీలో నివసిస్తున్న 32 ఏళ్ల అంజన అనే మహిళ తన 70 ఏళ్ల అత్త సంజనను హతమార్చింది. 
 
హత్యానేరం తమపై రాకుండా ఉండాలని తీవ్రగాయాలతో ఉన్న ఆమెను రాజవాడి ఆసుపత్రికి తీసుకువచ్చారు. బాత్ రూములో జారి పడిపోయిందని చెప్పారు. కొట్టిన దెబ్బలుగా గుర్తించిన వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో సంజన దత్తపుత్రుడు దినేష్ అతడి భార్య అంజన కలిసి అత్త సంజనను హతమార్చినట్లు తెలుసుకున్నారు.
 
సంజన భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. వారికి పిల్లలు లేకపోవడంతో భర్త సోదరుడి కుమారుడు దినేష్‌ను దత్తత తీసుకుంది. వారికి నాలుగు ఫ్లాట్లు.. రెండు చెంబూర్‌లో రెండు వర్లిలో ఉన్నాయి. మూడు ఫ్లాట్లను అద్దెకిచ్చి ఒక ఇంట్లో ఆమె తన దత్తపుత్రుడు, అతడి భార్యతో కలిసి ఉంటోంది. ఫ్లాట్లను అద్దెకు ఇవ్వడంతో వాటినుంచి అద్దె వస్తున్నా నగరంలోని ఘాట్కోపర్ ప్రాంతంలోని ఒక జైన దేవాలయం దగ్గర బిచ్చమెత్తుకునేది సంజన.
 
అద్దె డబ్బులన్నీ కోడలు తీసుకుని అత్తకు ఒక్క పైసా కూడా ఇచ్చేది కాదు. దీంతో సోమవారం అత్తాకోడళ్ల మధ్య వివాదం జరిగింది. ఈ గొడవలో పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకుని ఆమెపై దాడి చేసింది అంజనా. అయినా మరణించకపోవడంతో ఫోన్ చార్జింగ్ వైరుతో గొంతును బిగించి చంపేసింది.

ఉన్న నాలుగు ఫ్లాట్లను తమ పేరు మీద రాయనందునే ఆమెను చంపేశానని పోలీసుల విచారణలో అంజన పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.