శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జూన్ 2017 (20:16 IST)

పోసానికి రూ.2.50 కోట్లు.. ఎందుకు.. ఎవరిస్తున్నారు?

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళి ఒకరు. నటుడిగా, కమెడియన్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. అయితే, ఈయనకు ఓ సంస్థ రూ.2.50 కోట్లను ఇవ్వనుంది.

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళి ఒకరు. నటుడిగా, కమెడియన్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. అయితే, ఈయనకు ఓ సంస్థ రూ.2.50 కోట్లను ఇవ్వనుంది. ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు ఇస్తున్నారనే కదా మీ సందేహం... అయితే, ఈ కథనం చదవండి. 
 
దేశవ్యాప్తంగా నెంబర్‌ వన్‌ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న ‘బిగ్‌బాస్‌’ను తెలుగులో కూడా ప్రసారం చేయబోతోంది ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌. యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ ఈ షోను హోస్ట్‌ చేయబోతున్నాడు. అయినప్పటికీ ఈ షోలో పార్టిసిపేట్‌ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. సినిమా, టీవీ నటులెవరూ ఈ షోలో కనిపించేందుకు ఆసక్తి చూపించడం లేదట. దానికి కారణం ఈ షోలో చేయాల్సిన టాస్క్‌లు. అవి కొంచెం వివాదాస్పదంగా ఉండటమే. పైగా, కొన్ని నెలలపాటు ఓ ఇంటికే పరిమితమవ్వాల్సి ఉంటుది. ఈ కారణంగానే ఈ షో అంటే భయపడుతున్నారు. 
 
అయితే ఈ షోలో నటించేందుకు తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళీ అంగీకరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇందుకోసం ఆయన 2.5 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసినట్టు వినికిడి. కొన్ని నెలలపాటు సినిమాలు వదులుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద మొత్తం అడిగగా, ఈ డిమాండ్‌కు సదరు ఛానల్‌ యాజమాన్యం సమ్మతించినట్టు సమాచారం.