ఆదివారం, 27 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 నవంబరు 2016 (17:00 IST)

అన్నా లెజినోవాకు ఎంత అణకువ.. సూపర్ కదూ.. పవన్‌కు తగిన మనిషే.. ఆ ఫోటోలను?

తీన్‌మార్ సినిమాతో తెరంగేట్రం చేసిన విదేశీ ముద్దుగుమ్మ అన్నా లెజినోవా.. ఆపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మూడో భార్యగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈమె గురించి జనాలకు పెద్దగా తెలియదు. 2019 ఎన్నికల కోసం పవ

తీన్‌మార్ సినిమాతో తెరంగేట్రం చేసిన విదేశీ ముద్దుగుమ్మ అన్నా లెజినోవా.. ఆపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మూడో భార్యగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈమె గురించి జనాలకు పెద్దగా తెలియదు. 2019 ఎన్నికల కోసం పవన్ ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు అంటూ బిజీగా గడుపుతున్నాడు.

మరోవైపు అన్నా లెజినోవా కూడా చిన్న చిన్న ఫంక్షన్లలో మెరుస్తోంది. కానీ అన్నా తనకు సంబంధించిన ఏ ఫోటోనూ పబ్లిష్ చేయవద్దని మీడియాను కోరుతోంది. సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పటికీ.. అన్నా సామాన్యంగా ఉండేందుకే ఇష్టపడుతుంది. 
 
అలాంటి అన్నా లెజినోవా ఇటీవల మంచు ఫ్యామిలీ తన ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌లో ఇచ్చిన హాలోవీన్‌ పార్టీకి వచ్చిందట. ఈ పార్టీకి వచ్చిన ప్రముఖుల్లో పవన్ భార్యపైనే అందరి కన్నూ పడింది. ఆమెను చూసిన ఫోటోగ్రాఫర్లందరూ తమ కెమెరాలకు పనిచెప్పారు.

కానీ లెజినోవా మాత్రం ఆ ఫోటోలను డిలీట్ చేయమని కూల‌్‌గా చెప్పిందట. అంతటి సెలబ్రిటీ సున్నితంగా రిక్వెస్ట్ చేయడంతో ఆమె ఫోటోలను ఫోటో గ్రాఫర్లు డిలీట్ చేశారట. అయితే ఎవరో కొందరు స్టూడెంట్లు మాత్రం అన్నా ఫోటోలను డిలీట్‌ చేయకుండా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
ప్రస్తుతం ఆ ఫోటోలు షేర్లు, లైకులు, కామెంట్లు అంటూ చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా తెలుసుకున్న సినీ జనం అన్నా లెజినోవాకు అణకువ ఎక్కువని, వినయంగా ఉంటుందని.. పవన్‌కు తగిన మనిషేనని గుసగుసలాడుకుంటున్నారు.