శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (19:05 IST)

బాలీవుడ్ బ్యూటీ డిమాండ్ విని నోరెళ్లబెట్టిన తమిళ నిర్మాతలు...

తెలుగులో అగ్ర హీరోయిన్‌గా నటి పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో ఈ అమ్మడు రేంజ్ ఎక్కడికో ఎదిగిపోయింది. ఈ క్రమంలో పూజా హెగ్డేకు బాలీవుడ్ మూవీలు కూడా చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. 
 
ముఖ్యంగా, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో రెమ్యునరేషన్ పరంగా ఈ ముద్దుగుమ్మ భారీగానే డిమాండు చేస్తోంది. తాజాగా తమిళంలో ఓ సినిమాకి ఆమె తీసుకుంటున్న పారితోషికం ఫిగర్ తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.
 
తన కెరీర్ తొలినాళ్లలో 'ముగమూడి' అనే తమిళ సినిమాలో కథానాయికగా నటించింది. మళ్లీ ఇప్పుడు స్టార్ హీరో విజయ్ సరసన కథానాయికగా నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. 
 
ఇళయదళపతి విజయ్ తన 65వ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డేను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఈ చిత్రంలో నటించడానికి ఈ చిన్నది రూ.3.5 కోట్లు డిమాండ్ చేసినట్టు, చేసేదేమీలేక ఆమె అడిగినంతా ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.