సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By tj
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2017 (12:01 IST)

రూ.80 లక్షలిస్తే అలా నటిస్తా.. ఎవరు..?

పూజా హెగ్డే. 'ముకుంద' సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టిన భామ. ఆ తరువాత అడపాదడపా అఖిల్, ఆ తరువాత హృతిక్ రోషన్‌లతో నటించి ఆ తరువాత బాలీవుడ్‌లో అవకాశం రాకపోవడంతో సైలెంట్ అయిపోయింది.

పూజా హెగ్డే. 'ముకుంద' సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టిన భామ. ఆ తరువాత అడపాదడపా అఖిల్, ఆ తరువాత హృతిక్ రోషన్‌లతో నటించి ఆ తరువాత బాలీవుడ్‌లో అవకాశం రాకపోవడంతో సైలెంట్ అయిపోయింది. అయితే తెలుగులో డిజె (దువ్వాడ జగన్నాథం) పేరుతో ఒక సినిమాలో నటిస్తోంది. ఈనెలే ఆ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అయితే పూజా మాత్రం రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా అడుగుతోందట. రూ.80 లక్షల రూపాయలు ఇస్తేనే నటిస్తానని లేకుంటే లేదని తేల్చి చెప్పోస్తోందట. తాజాగా ఒక నిర్మాత తన సినిమాలో నటించమని అడిగితే ఒక్కసారిగా ఇంత మొత్తం ఇవ్వాలందట. తగ్గించుకోమని ఎంత అడిగినా ఆమె మాత్రం ఒప్పుకోలేదట. దీంతో నిర్మాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. 
 
సినిమాలో నటించకపోయినా ఫర్వాలేదు కానీ అనుకున్నంత రెమ్యునరేషన్ ఇస్తేనే నటించాలని పూజా నిర్ణయం కూడా తీసేసుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనలో కూడా ఉన్నారట హెగ్డే. అయితే పూజా వ్యవహారంపై తెలుగు సినీపరిశ్రమలో చర్చ మొదలైంది. కొత్తగా వచ్చిన హీరోయిన్ ఇంత డిమాండ్ చేస్తే టాప్ హీరోయిన్లు ఎంత డిమాండ్ చేయాలని చెవులు కొరుక్కుంటున్నారు సినీ వర్గాలు.