రాంగోపాల్ వర్మకు సన్నీ లియోన్.. ఆ నోరు కంటే పబ్లిక్ టాయ్‌లెట్టే నయం...
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గూబగుయ్యమనేలా రివర్స్ ట్వీట్ చేసింది. సోషల్ మీడియా పవరేంటో తెలియని కొంతమంది వాగుడుగాళ్ల నోటిని పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా వాడుతున్నారం
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గూబగుయ్యమనేలా రివర్స్ ట్వీట్ చేసింది. సోషల్ మీడియా పవరేంటో తెలియని కొంతమంది వాగుడుగాళ్ల నోటిని పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా వాడుతున్నారంటూ ట్వీట్స్ చేశారు. ఇలాంటివారి నోళ్లు మూయించాలంటూ డిమాండ్ చేసింది.
ఇటీవల మహిళా దినోత్సవం రోజున సన్నీ లియోన్‌లా ప్రపంచంలోని మహిళంతా పురుషులను సంతోషపెట్టాలంటూ ఆర్జీవీ కామెంట్స్ చేశారు. దీనిపై మహిళా లోకం గగ్గోలు పెట్టడంతో దిగివచ్చిన రాంగోపాల్ వర్మ మహిళాలోకానికి సారీ చెప్పారు.
రాంగోపాల్ వర్మ మాదిరిగానే కొందరు చెత్త కామెంట్లు, ట్వీట్స్, పోస్టులతో విసిగిస్తున్నారు. వారికి సోషల్ మీడియాను సరైన రీతిలో ఉపయోగించుకోవడం తెలీదు. చెడు పనులకు కొందరు దానిని వేదికగా చేసుకుని కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివారికి తగిన బుద్ధి చెప్పాలంటూ ఆర్జీవీ పేరును చెప్పకుండానే సన్నీ ఘాటుగా స్పందించారు.