శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (15:46 IST)

ప్రభాస్ - అనుష్క పెళ్లి : టాలీవుడ్‌కు తెలియదు కానీ.. ఆయనకు తెలిసిపోయింది

టాలీవుడ్ హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి వ్యవహారం మరోమారు చర్చకు వచ్చింది. వీరిద్దరు వచ్చే డిసెంబరుల వివాహం చేసుకోబుతున్నారట. ఈ విషయాన్ని బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు తన ట్విట్టర్ ఖా

టాలీవుడ్ హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి వ్యవహారం మరోమారు చర్చకు వచ్చింది. వీరిద్దరు వచ్చే డిసెంబరుల వివాహం చేసుకోబుతున్నారట. ఈ విషయాన్ని బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
'బాహుబలి అభిమానులకు బ్రేకింగ్ న్యూస్. ప్రభాస్, అనుష్క శెట్టిలకు ఈ డిసెంబరులో నిశ్చితార్థం' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పైగా, వీరిద్దరి మధ్య మంచి సంబంధం ఉందంటూ పేర్కొన్నారు. 
 
వాస్తవానికి వీరిద్దరి పెళ్లి వ్యవహారం ఏదైనా ఉంటే ముందుగా టాలీవుడ్‌లోని పెద్దలకు తెలిసే అవకాశం కానీ, బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్‌ అయిన ఉమర్ సంధు దీనిపై ట్వీట్ చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.