బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 మే 2017 (11:18 IST)

''బాహుబలి''కి గాలం వేస్తున్న కమలం.. నో.. నో అంటోన్న ప్రభాస్..?

''బాహుబలి 2'' వసూళ్ళు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటి వరకూ వెయ్యి కోట్లు వసూలు చేసిందని రాబోయే రోజుల్లో అది 1500 కోట్లు వసూలు చేయడం ఖాయమని నిర్మాత దేవినేని ప్రసాద్ అంటున్నారు. అయితే

''బాహుబలి 2'' వసూళ్ళు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటి వరకూ వెయ్యి కోట్లు వసూలు చేసిందని రాబోయే రోజుల్లో అది 1500 కోట్లు వసూలు చేయడం ఖాయమని నిర్మాత దేవినేని ప్రసాద్ అంటున్నారు. అయితే బాహుబలి ది బిగినింగ్ ద్వారా దాదాపు రూ.70 కోట్లు నష్టం వచ్చిందని చెప్పిన అదే నోటితో బాహుబలి 2 ద్వారా లాభాలొచ్చాయని చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాలో నటించిన నటీనటులకు మంచి క్రేజ్ లభించింది. ముఖ్యంగా ప్రభాస్‌కు ఈ సినిమా ద్వారా భారీ ఆఫర్లు వస్తున్నాయి. అంతేగాకుండా పొలిటికల్ ఆఫర్లు కూడా వస్తున్నాయని టాక్. ప్రభాస్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓ జాతీయ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రభాస్‌తో ఎన్నికల ప్రచారం చేయిస్తే, గెలుపు ఖాయమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
ప్రభాస్‌ను ఎలాగైనా రాజకీయాల్లో తీసుకురావాలనే లక్ష్యంతో సదరు పార్టీ వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. అయితే, తన రాజకీయ ప్రచారంపై ప్రభాస్ ఇంతవరకూ నోరు విప్పలేదని తెలుస్తోంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రస్తుతం బీజేపీలో ఉండటంతో ప్రభాస్‌కు గాలం వేయాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు ప్రభాస్ మాత్రం దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.