శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 27 జులై 2017 (10:57 IST)

రాధికా ఆప్టే ఫోటోగ్రాఫర్లపై చిందులేసింది.. ఎందుకో తెలుసా? ఆ సీన్లను?

అభినయం, గ్లామర్‌ను పండించడంలో ఆరితేరిన ‘లెజెండ్’ బ్యూటీ రాధిక ఆప్టే, మీడియాకు చుక్కలు చూపించడంలోనూ దిట్ట. గతంలో ‘పార్చేడ్’ సినిమాలో న్యూడ్ సన్నివేశం గురించి ప్రశ్నిస్తున్న మీడియా ప్రతినిధిపై అవాక్కయ్య

అభినయం, గ్లామర్‌ను పండించడంలో ఆరితేరిన ‘లెజెండ్’ బ్యూటీ రాధిక ఆప్టే, మీడియాకు చుక్కలు చూపించడంలోనూ దిట్ట. గతంలో ‘పార్చేడ్’ సినిమాలో న్యూడ్ సన్నివేశం గురించి ప్రశ్నిస్తున్న మీడియా ప్రతినిధిపై అవాక్కయ్యేలా స్పందించిన రాధిక, తాజాగా మరోసారి మీడియా ఫోటోగ్రాఫర్లపై ఫైర్ అయ్యింది.
 
ఇంకా బోల్డ్ యాక్టర్‌గా పేరున్న రాధికా ఆప్టేకు కోపమొచ్చింది. ఫోటోగ్రాఫర్లపై ఫైర్ అయ్యింది. తాజాగా బజార్ అనే బాలీవుడ్ షూటింగ్ జరుగుతుండగా కెమెరానమెన్లపై మండిపడింది. ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. అక్కడికి చేరుతున్న ఫోటోగ్రాఫర్లు ఆమె పర్సనల్ మూమెంట్స్‌పై కెమెరాలను క్లిక్ మనిపించారు. అదే రాధికకు కోపం తెప్పించింది. తన అనుమతి తీసుకోకుండా ఫోటోలను తీయడం పట్ల రాధికా ఆప్టే అభ్యంతరం తెలిపింది. 
 
ఆ ఫోటోలను డిలీట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన రాధికా ఆప్టే లుక్ ఇప్పట్లో బయటికి రాకుండా చూడాలని దర్శక నిర్మాతలు బలంగా అనుకున్నారట. అందుకే రాధికా కెమెరా మెన్లపై ఫైర్ అయ్యిందని బాలీవుడ్ జనం అంటున్నారు.