దిల్ రాజు జారుకున్నారు... కబాలి 'కత్తి'లా ఉంటుందా...? 'సుత్తి'లా ఉంటుందా...?
రజనీకాంత్ 'కబాలి' సినిమా తెలుగు హక్కులు పొందేందుకు పెద్దపెద్ద డిస్ట్రిబ్యూటర్లే లైన్లో వున్నారు. గత కొద్దిరోజులుగా ఈ హక్కుల కోసం తర్జనభర్జనలు జరుగుతూనే వున్నాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ
రజనీకాంత్ 'కబాలి' సినిమా తెలుగు హక్కులు పొందేందుకు పెద్దపెద్ద డిస్ట్రిబ్యూటర్లే లైన్లో వున్నారు. గత కొద్దిరోజులుగా ఈ హక్కుల కోసం తర్జనభర్జనలు జరుగుతూనే వున్నాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రం కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే... తమిళ నిర్మాతలు పెద్ద రేటు చెప్పడంతో.. తటపటాయిస్తున్నట్లు ఇటీవలే వెల్లడించారు. అయితే ఈరోజు ఫైనల్‌గా... దిల్‌రాజు.. పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది.
పెద్ద పోటీ మధ్య షణ్ముక పిక్చర్స్ 'కబాలి' తెలుగు రిలీజ్ హక్కులను సొంతం చేసుకుంది. షణ్ముక పిక్చర్స్‌పై భారీ మొత్తానికి ప్రవీణ్ చౌదరి ఈ హక్కులను కొనుగోలు చేశారు. దర్శకుడు రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీ ఓ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. అన్ని భాషల్లోనూ థింక్ మ్యూజిక్ ద్వారా విడుదల కానున్న ఆడియో, ఈ నెల 12న మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఇక సినిమా జూలై 1న విడుదల కానుంది.
ఇదిలావుంటే సహజంగా దిల్ రాజు ఏ చిత్రాన్నయినా వదులుకున్నారంటే వాటిలో చాలామటుకు రెడ్ మార్కులు పడుతాయి. ఈ నేపధ్యంలో కబాలి చిత్రాన్ని దిల్ రాజు వదులుకోవడంతో కబాలి కత్తిలా ఉంటుందా...? సుత్తిలా ఉంటుందా...? అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు సెంటిమెంట్లను నమ్ముతున్న కొంతమంది.