శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr

ముఖ్యమంత్రిగా రజనీకాంత్.. ఎక్కడ?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యమంత్రి కానున్నారు. రాజకీయ పార్టీ పెట్టకుండానే, ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందకుండానే ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతారన్నదే కదా మీ సందేహం. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది వెండితెరపైన

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యమంత్రి కానున్నారు. రాజకీయ పార్టీ పెట్టకుండానే, ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందకుండానే ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతారన్నదే కదా మీ సందేహం. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది వెండితెరపైనే.  
 
ఇందుకోసం దర్శకుడు శంకర్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. శంకర్ తన సూపర్‌హిట్‌ చిత్రాల్లో ఒకటైన ‘ముదల్వన్‌’ (ముఖ్యమంత్రి అని అర్థం)కి సీక్వెల్‌ తీసే యోచనలో శంకర్‌ ఉన్నారట. అందులో రజనీకాంత్‌ని నటింపజేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిజానికి ‘ముదల్వన్‌’ చిత్రంలో రజనీయే నటించాల్సి ఉంది.
 
అప్పటిపరిస్థితుల్లో రాజకీయ నేపథ్య చిత్రం చేయడంపై ఆయన విముఖత చూపడంతో అది యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఖాతాలో చేరింది. ప్రస్తుతం ‘ముదల్వన్‌’ సీక్వెల్‌కి స్రిప్టు పనులు జరుగుతున్నాయని, అది కూడా ‘బాహుబలి’ కథారచయిత విజయేంద్ర ప్రసాదే కథ సిద్ధం చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌.