శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 ఏప్రియల్ 2022 (12:24 IST)

గ్లామర్ కోసం బక్కచిక్కిన రకుల్ ప్రీత్ సింగ్‌కి ఆ స్టార్ హీరో ఛాన్స్

Rakul Preet singh
రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలుత సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఎందుకనో కానీ వెనకబడిపోయింది. అలాగని ఛాన్సులు మాత్రం రావడం లేదని అనుకోకండి. వరుస ఛాన్సులతో దూసుకెళ్తోంది.

 
ఈమధ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ గ్లామర్ చూపించేందుకు అవసరమైనన్ని ప్రయత్నాలు చేసింది. ఎద అందాలను ఆరబోయటమే కాకుండా జీరో సైజు కోసం తంటాలు పడి సాధించింది. కానీ జీరో సైజ్ ఫలితమో ఏమోగానీ రకుల్ కాస్తా బక్కచిక్కి ముఖం కళావిహీనంగా మారింది. దాంతో ఆమె ఫ్యాన్స్... రకుల్ లుక్ పైన తమ కామెంట్స్ పోస్ట్ చేసారట. దానితో మళ్లీ కొవ్వు పెంచుకునే పనిలో పడిందట రకుల్.

 
ఇదిలావుంటే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్... తన తాజా చిత్రంలో రకుల్ ప్రీత్ సింగుకి ఛాన్స్ ఇచ్చినట్లు కోడంబాక్కం సినీజనం చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే రకుల్ ప్రీత్ సింగ్‌కి మరో భారీ ఆఫర్ వచ్చినట్లే.