బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 9 మార్చి 2022 (19:44 IST)

ఇందులో కనిపెట్టేందుకు ఏమీలేదు, అతడితో రిలేషన్ నిజం: రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులతో ఏదీ దాచకుండా ముఖం మీదే చెప్పేస్తుంటుంది. తను రకుల్ జాకీ భగ్నానితో రిలేషన్లో వున్న సంగతి తేల్చి చెప్పింది. తన జీవితంలో జరిగే విషయాలను గోప్యంగా వుంచుకోవడం ఇష్టం వుండదనీ, అందుకే అతడితో వున్న రిలేషన్ విషయాన్ని వెంటనే చెప్పేస్తున్నట్లు వెల్లడించింది.


ఇది వ్యక్తిగత విషయమైనప్పటికీ దాని గురించి కొందరు గాసిప్స్ రాసి, ఆ వార్తలు గురించి నేను క్లారిటీ ఇచ్చి... ఇదంతా అవసరమా. నా జీవితంలో ఏది జరిగితే అది వెంటనే మీకు చెప్పాసాననుకోండి, మీకూ టెన్షన్ వుండదు కదా అని షాకింక్ కామెంట్స్ చేసింది.

 
కండోమ్ టెస్టర్‌గా నటిస్తున్నా... 
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్‌గా కొత్త అవతారం ఎత్తింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తేజాస్ దర్శకత్వంలో, రోనీ స్క్రూవాలా నిర్మాణంలో ఛత్రివాలి అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

 
ఈ ఫస్ట్ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఓ కండోమ్ ప్యాకెట్‌ని ఓపెన్ చేస్తూ కనిపిస్తోంది. కండోమ్ టెస్టర్ అంటే.. కండోమ్ నాణ్యతని అనుభవపూర్వకంగా శృంగారంలో పాల్గొని తెలుసుకోవాలి. కండోమ్ తయారు చేసిన కంపెనీకి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. దీనితో కండోమ్ టెస్టర్లు కంపెనీ నుంచి వేతనం పొందుతారు. రకుల్ పోషిస్తున్న ఈ పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది. ఇక కథ పరంగా శృంగార సన్నివేశాలు ఉంటాయి. 

 
ఇలాంటి చిత్రంలో నటించడంపై తాజాగా రకుల్ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలుండవని.. వాస్తవానికి ఫ్యామిలీ మొత్తం ఈ చిత్రాన్ని చూడాలి. ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే అవగాహన పెరుగుతుంది అని రకుల్ ప్రీత్ తెలిపింది. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి ఉద్యోగం కోసం కండోమ్ టెస్టర్‌గా మారిన అమ్మాయి కథే ఈ చిత్రమని తెలిపింది.