గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (20:15 IST)

నగ్న ఫోటో చూసి కష్టాలు తీరే మార్గం చెప్తానన్న వ్యక్తి, నమ్మి పంపిన మహిళ, ఆ తర్వాత?

తనతో పాటే పనిచేసే వ్యక్తే కదా అని చనువుగా ఉండేది. దాన్నే ఆసరాగా తీసుకున్నాడు అతను. ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలని భావించాడు. తనకు జాతకం బాగా చెప్పడం తెలుసని బిల్డప్ ఇచ్చాడు. ఇలా చాలా రోజులుగా తెలిసినవారికి జాతకాలు చెపుతూ వున్నాడు. ఓ రోజు తన ఆర్థిక సమస్యలు తీరడానికి మార్గం చెప్పాలని కోరింది స్నేహితురాలు. ఇదే అదునుగా ఆమెను నగ్న ఫోటోలను పంపమన్నాడు.. తరువాత..

 
జైపూర్‌కు చెందిన స్వరూప్, ఒక వివాహిత స్థానికంగా ఎయిర్ పోర్ట్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే సెక్షన్లో పనిచేస్తుండటంతో చనువు పెరిగింది. ఇద్దరు స్నేహితుల్లాగా ఉండేవారు. అయితే ఆ వివాహితను ఎలాగైనా లోబరుచుకోవాలని భావించాడు స్వరూప్.

 
తనకు జాతకం చెప్పడం బాగా తెలుసునంటూ అక్కడున్న వారందరికీ చేతులు చూసి, ముఖం చేసి జాతకాలు చెప్పేవాడు. ఇది ఇలాగే జరుగుతుండగా ఆ వివాహితకు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో స్వరూప్‌ను ప్రాధేయపడింది. తనకు పట్టిన సమస్య ఎప్పటిలోగా తీరే అవకాశముందో చెప్పాలని కోరింది. అయితే నీ సమస్య తీరాలంటే ముఖం, చేతులు కాదు, నగ్న ఫోటో పంపితే అది చూసి కరెక్ట్‌గా చెబుతానన్నాడు.

 
మొదట్లో ఒప్పుకోని ఆ మహిళ తన స్నేహితుడే కదా అని నగ్న ఫోటో తీసి పంపింది. అంతే... ఆ ఫోటోను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. జాతకం చెప్పలేదు కదా ఆమెను శారీరకం హింసించడం ప్రారంభించాడు. 

 
తన కోర్కె తీర్చాలని లేకుంటే ఫోటోలను నెట్‌లో పెట్టేస్తానన్నాడు. దీంతో ఆమె భయపడింది. వారంరోజుల పాటు అతను చెప్పిన చోటికి వెళ్ళేది. అతను చిత్రహింసలకు గురిచేయడంతో చేసేది లేక చివరకు అసలు విషయాన్ని భర్తకు చెప్పింది. దీనితో తన భార్యకు ఫోన్ చేసిన సమయంలో.. ఇకపై ఆమెకి ఫోన్ చేయవద్దని హెచ్చరించాడు. ఐనా అతడు వినలేదు. మళ్లీమళ్లీ ఫోన్ చేస్తూనే వున్నాడు. ఇక లాభంలేదనుకుని... తన భార్యతో ఫోన్లో ఫలానా చోట వెయిట్ చేయమని చెప్పంచాడు.

 
ఆ తర్వాత తన స్నేహితులతో కారులో వెళ్లి అతడిని కిడ్నాప్ చేసి దూరంగా తీసుకెళ్లాడు. అక్కడ కారు నుంచి కిందకు దింపి బాగా దేహశుద్ధి చేసారు. అనంతరం అతడిని పోలీసు స్టేషనులో అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని దగ్గర నుంచి నగ్న ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు.