బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (16:50 IST)

ఆ హీరోయిన్ కోసం క్యూకడుతున్న కోలీవుడ్ హీరోలు..

తెలుగు చిత్ర పరిశ్రమకు దిగుమతి అయిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. పైగా, ఈ మధ్య వరుస విజయాలు సాధిస్తూ జెట్ స్పీడ్‌ వేగంతో దూసుకెళుతుంది.

తెలుగు చిత్ర పరిశ్రమకు దిగుమతి అయిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. పైగా, ఈ మధ్య వరుస విజయాలు సాధిస్తూ జెట్ స్పీడ్‌ వేగంతో దూసుకెళుతుంది.
 
తాజాగా ఆమె నటించిన "స్పైడర్" మూవీ ఈనెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న రకుల్, తమిళంలో కార్తీ సరసన ఓ చిత్రం, హిందీలో ఓ మూవీ చేస్తుంది. కార్తీ నటిస్తున్న 'తీరన్ అధిగారం ఒండ్రు' సినిమాలో రకుల్ పేద యువతి పాత్ర చేస్తుంది. ఇది తనకు ఎంతో పేరు తెస్తుందన్నారు. ఇక హిందీలో సిద్ధార్ద్‌ మల్హోత్రా సరసన అయ్యారీ అనే సినిమా చేస్తుంది. 
 
రకుల్ నటించిన స్పైడర్ చిత్రం ఇటు తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుండగా, ఈ సినిమాతో రకుల్‌కి తమిళ అభిమానుల ఫ్యాన్‌ ఫాలోయింగ్ విపరీతంగా పెరగనుందని తెలుస్తుంది. ఇక కోలీవుడ్ హీరోలు కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారని టాక్. విజయ్‌తో పాటు.. విశాల్‌తో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ అవకాశాలను వదులుకున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.