గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 10 జులై 2017 (10:08 IST)

రమ్యకృష్ణ ఆ రోల్‌లో కనిపించనుందట..

బాహుబలి చిత్రంలో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ.. త్వరలో రాజకీయ నాయకురాలి అవతారం ఎత్తనుంది. ఓ వైపు సీరియళ్లు మరోవైపు.. వచ్చిన సినీ ఛాన్సులను ఉపయోగించుకుంటున్న రమ్యకృష్ణ.. పవర్ ఫుల్ పాత్రల్లో నటించేందు

బాహుబలి చిత్రంలో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ.. త్వరలో రాజకీయ నాయకురాలి అవతారం ఎత్తనుంది. ఓ వైపు సీరియళ్లు మరోవైపు.. వచ్చిన సినీ ఛాన్సులను ఉపయోగించుకుంటున్న రమ్యకృష్ణ.. పవర్ ఫుల్ పాత్రల్లో నటించేందుకు సై అంటోంది. తాజాగా రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా రెడీ అవుతోంది.  నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రమ్యకృష్ణ ఈ తరహా పాత్రను పోషిస్తోంది. 
 
'బాహుబలి'కి శివగామి పాత్ర ఎంతటి కీలకమో, ఇప్పుడీ చిత్రానికి కూడా రమ్యకృష్ణ పాత్ర కీలకమని సినీ వర్గాల్లో టాక్. రమ్యకృష్ణ, నారా రోహిత్ మధ్య పవర్ ఫుల్ సీన్స్ వున్నాయని, ఇవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని సినీ యూనిట్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో వున్నట్లు  సమాచారం. ఈ సినిమా టీజర్ జూలై 25వ (నారా రోహిత్) తేదీన రిలీజయ్యే అవకాశం ఉందని సమాచారం.