కొరియన్ సినిమాపై మనసు పడ్డ మాస్ మహరాజ
మాస్ మహరాజ రవితేజ ''బెంగాల్ టైగర్'' చిత్రం తరువాత ఏ చిత్రానికి సంతకం చేయలేదు. దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న రవితేజ తన తదుపరి చిత్రం కోసం ఇప్పటికే పలువురు దర్శకులతో, నిర్మాతలతో చర్చలు కూడా జరిపిన
మాస్ మహరాజ రవితేజ ''బెంగాల్ టైగర్'' చిత్రం తరువాత ఏ చిత్రానికి సంతకం చేయలేదు. దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న రవితేజ తన తదుపరి చిత్రం కోసం ఇప్పటికే పలువురు దర్శకులతో, నిర్మాతలతో చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ''పవర్'' లాంటి సూపర్ హిట్ సినిమాను తనకిచ్చిన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకున్నాడట.
మరో పక్క ''సర్దార్ గబ్బర్ సింగ్'' లాంటి భారీ ఫ్లాప్ చిత్రాన్ని తీసిన బాబీకి మళ్ళీ రవితేజ అవకాశం ఇవ్వడంతో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టి తీరాలని బాబీ భావిస్తున్నాడట. అయితే వీరిద్దరి కలయికలో రూపొందే ఈ సినిమా ఓ సూపర్ హిట్ కొరియన్ సినిమాకు రీమేక్‌గా ఉండనుందట. బాబీ చెప్పిన కథ నచ్చడంతో రవితేజ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఇప్పటికే ఆ సినిమాకు సంబందించిన హక్కులు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట దర్శకనిర్మాతలు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. మరి ఈ సినిమా రవితేజ, బాబిలకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.