గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (11:57 IST)

ప్రేమ మైకంలో పడిపోయా.. అందుకే ఆఫర్లు దూరమయ్యాయి : రెజీనా

టాలీవుడ్‌కు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో రెజీనా కాసాండ్రా ఒకరు. ఈమెకు ఆరంభంలో అనేక ఆఫర్లు వచ్చాయి. పైగా ఆమె నటించిన చిత్రాన్ని మంచి విజయాలను అందుకున్నాయి.

టాలీవుడ్‌కు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో రెజీనా కాసాండ్రా ఒకరు. ఈమెకు ఆరంభంలో అనేక ఆఫర్లు వచ్చాయి. పైగా ఆమె నటించిన చిత్రాన్ని మంచి విజయాలను అందుకున్నాయి. కానీ, ఆమెకు మాత్రం స్టార్‌డమ్ రాలేదు. పైగా, ఆమెకంటే వెనుక వచ్చిన హీరోయిన్లు మంచి పేరు తెచ్చుకుని, వరుస ఆఫర్లతో దూసుకెళుతున్నారు. రెజీనా పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. 
 
దీనిపై రెజీనా స్పందిస్తూ.. కెరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడటంతో... తనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోయాయని తెలిపింది. ఇప్పుడు ఆ మత్తును వదిలించుకున్నానని... ఇకపై ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలను వదిలేసి, కెరీర్‌పైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని చెప్పింది. అయితే, ఎవరి ప్రేమలో పడిందనే విషయాన్ని మాత్రం ఈ అమ్మడు వెల్లడించలేదు. కానీ, ఆమె ప్రియుడు ఎవరన్న విషయం అందరికీ తెలిసిందేనని కొందరు అంటున్నారు.