మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 11 జులై 2017 (17:15 IST)

మరింత అందంగా కనిపించాలని ముక్కుకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. ఎంతో అందంగా కనిపించే ఈ కలువ కళ్ల సుందరి... మరింతగా అందంగా కనిపించాలని పరితపించిందట. దీంతో ఆమె తాజాగా ముక్కుకి సర్జరీ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. ఎంతో అందంగా కనిపించే ఈ కలువ కళ్ల సుందరి... మరింతగా అందంగా కనిపించాలని పరితపించిందట. దీంతో ఆమె తాజాగా ముక్కుకి సర్జరీ చేయించుకుందట. ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత‌కుముందు ఫోటోల‌లో ఇప్పుడు ఫోటోస్‌లో కాజ‌ల్ ముక్కు తీరు కాస్త భిన్నంగా ఉందంటూ చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి దీనిపై కాజ‌ల్ ఏదైన స్ప‌ష్ట‌త ఇస్తుందేమో చూడాలి.
 
అయితే, ప్రస్తుతం కాజల్ చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి. దగ్గుబాటి రానా నటిస్తున్న తాజా చిత్రం "నేనే రాజు నేనే మంత్రి"లో క‌థానాయిక‌గా న‌టించింది. త‌మిళంలో అజిత్ హీరోగా తెర‌కెక్కిన "వివేగం" చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక క‌ళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఏ చిత్రంలోనూ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అలాంటపుడు ముక్కుకి సర్జరీ ఎలా చేయించుకున్నారన్న సందేహం వెంటాడుతోంది.