ఆఫ్ స్క్రీన్‌లో డేటింగ్ చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న సాయిధరమ్ తేజ్ - ప్రగ్యా జైస్వాల్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారన్న వార్తలు కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా 'ప
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారన్న వార్తలు కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా 'పిల్లా నువ్వులేని జీవితం' షూటింగ్ టైంలో ప్రేమలో పడిపోయారని, రెండో సినిమా "సుబ్రమణ్యం ఫర్ సేల్'' షూటింగ్ సమయంలో ఇద్దరూ బాగా దగ్గరయ్యారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలావుంటే వీరిద్దరు ఓ గెస్ట్‌హౌస్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారట. ఈ గెస్ట్‌హౌస్‌లోనే ఎక్కువగా కనపడుతున్నారన్న టాక్ వినిపించింది.
అంతేకాదు వీరిద్దరు సీక్రెట్‌గా ఓ ట్రిప్‌కి కూడా వెళ్లి వచ్చారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హీరో మళ్లీ ఓ హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకుని లేట్ నైట్స్‌లో చేస్తున్న హల్ చల్ మీడియా కంట పడింది. అంతే... అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టేసారు. అందులోభాగంగా సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ డేటింగ్‌లో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సందీప్ కిషన్, రెజీనా కాంబినేషన్‌లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'నక్షత్రం' చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో సాయిధరమ్ తేజ్‌కి జంటగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయట. ఈ రొమాంటిక్ సీన్స్‌లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందని సమాచారం. ఆన్ స్క్రీన్‌లో రొమాన్స్ చేస్తున్న వీరిద్దరు ఆఫ్‌స్క్రీన్‌లో కూడా డేటింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. లేట్‌నైట్స్‌లో జూబ్లిహిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో గంటలు గంటలు కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నారట. మరి వీరి డేటింగ్ ఎక్కడివరకూ వెళుతుందో వేచి చూద్దాం.