శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 13 జులై 2018 (22:01 IST)

ఫుల్లు టెన్షన్ పడుతున్న సాయిధరమ్ తేజ్

సాయిధ‌ర‌మ్ తేజ్‌కి వ‌రుస ఫ్లాప్స్ వ‌స్తుండ‌టంతో బ‌డా డైరెక్ట‌ర్స్‌ని న‌మ్ముకున్నాడు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌తో ఇంటిలిజెంట్ సినిమా చేసాడు. కానీ.. స‌క్స‌స్ కాలేదు. ఆత‌ర్వాత క‌రుణాక‌ర‌న్‌తో తేజ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా తేజ్‌ని ఆదుకోలేక‌పో

సాయిధ‌ర‌మ్ తేజ్‌కి వ‌రుస ఫ్లాప్స్ వ‌స్తుండ‌టంతో బ‌డా డైరెక్ట‌ర్స్‌ని న‌మ్ముకున్నాడు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌తో ఇంటిలిజెంట్ సినిమా చేసాడు. కానీ.. స‌క్స‌స్ కాలేదు. ఆత‌ర్వాత క‌రుణాక‌ర‌న్‌తో తేజ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా తేజ్‌ని ఆదుకోలేక‌పోయింది. దీంతో బాగా టెన్షన్ ప‌డుతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ మెగా హీరో కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.
 
అయితే.. తేజ్ - గోపీచంద్ మ‌లినేని క‌లిసి విన్న‌ర్ సినిమా చేసారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో వీరిద్ద‌రూ మ‌ళ్లీ సినిమా చేయాల‌నుకున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ఉంటుందేమో అనుకున్నారు. కానీ.. తాజాగా తేజ్... గోపాల్ అనే కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన స్ర్కిప్ట్‌కి ఓకే చెప్పాడు. దీనిని ఠాగూర్ మ‌ధు నిర్మించ‌నున్నారు. ఈ సినిమా కోసం భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా అనే టైటిల్ నిర్ణ‌యించారు. త్వ‌ర‌లోనే ఈ మూవీని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ట‌. సో...ఇప్ప‌ట్లో తేజ్ - గోపీచంద్ మూవీ లేన‌ట్లే..!