శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 17 మే 2018 (09:31 IST)

తెలంగాణ హైబీపీలో రెండో స్థానం.. అదుపులో వుంచుకోకపోతే?

మధుమేహ రోగుల విషయంలో అగ్రస్థానంలో వున్న తెలంగాణ ప్రస్తుతం అధిక రక్తపోటు (హైబీపీ) రోగుల విషయంలో రెండో స్థానంలో నిలిచింది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో వున్నట్లు తెలంగాణ సర్కారు.. రోగాల వి

మధుమేహ రోగుల విషయంలో అగ్రస్థానంలో వున్న తెలంగాణ ప్రస్తుతం అధిక రక్తపోటు (హైబీపీ) రోగుల విషయంలో రెండో స్థానంలో నిలిచింది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో వున్నట్లు తెలంగాణ సర్కారు.. రోగాల విషయంలోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
 
ఈ మేరకు జాతీయ పోషకాహార సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా హైబీపీ రోగుల సంఖ్య అధికంగా ఉందని తేలింది. దేశవ్యాప్తంగా మొత్తం 14 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని.. మరో పదేళ్లలో వీరి సంఖ్య 21.4 కోట్లకు చేరుతుందని వైద్యులు చెప్తున్నారు. పురుషుల్లో 39శాతం, మహిళల్లో 29శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారని చెప్పారు. 
 
రక్తపోటును అదుపులో వుంచుకోకపోతే.. పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, గుండె, కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. 40 ఏళ్ల లోపు గల వారు ఈ వ్యాధితో బాధపడుతున్నారని.. అయితే హైబీపీ నుంచి బయటపడాలంటే.. జీవిత విధానంలో మార్పు చేసుకోవాలని డాక్టర్ శివరాజు చెప్పారు.