గురువారం, 17 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 5 జులై 2016 (16:27 IST)

కరీనా కపూర్‌కు కడుపొచ్చిందంటగా అని నన్నడుగుతావా.. ఎవడ్రా నువ్వూ...? చిందులేసిన సైఫ్ మాజీభార్య

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ భార్య(రెండోభార్య) కరీనా కపూర్ ప్రస్తుతం గర్భం దాల్చింది. ఈ వార్తలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన ఆయా పత్రికల సినీ రిపోర్టర్లు ఊరుకుంటారా...? వారిలో ఓ పిల్ల జర్నలిస్టు సెల్ ఫోన్ పట్టు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ భార్య(రెండోభార్య) కరీనా కపూర్ ప్రస్తుతం గర్భం దాల్చింది. ఈ వార్తలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన ఆయా పత్రికల సినీ రిపోర్టర్లు ఊరుకుంటారా...? వారిలో ఓ పిల్ల జర్నలిస్టు సెల్ ఫోన్ పట్టుకుని సైఫ్ అలీ ఖాన్ మాజీ భార్య అమృతా సింగ్‌కు ఫోన్ చేశాడట. 
 
ఆ ఫోనులో అతడు మాట్లాడుతూ... అమృతా మేడం... మీ మాజీ భర్త సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ ప్రెగ్నెంట్ అంటున్నారు. దీనిపై మీరేమంటారు అని అమాయకంగా ప్రశ్నించాడట. ఇంకేముంది అమృతా సింగ్ ఇంతెత్తున లేచిందట. 
 
ఎవడ్రా నువ్వు...? కరీనా కపూర్‌కు కడుపొచ్చిందటగా అంటూ నన్నే అడుగుతావా..? ఈ ప్రశ్న నన్ను అడగడానికి నీకెన్ని గట్స్ అంటూ ఫోనులోనే చెడామడా తిట్టిపోసిందిట. పాపం పిల్లజర్నలిస్ట్ ఆమె దెబ్బకు జడుసుకుని ఫోన్ పెట్టేశాడట. కానీ అమృత మాత్రం అతడు ఫోన్ పెట్టిన తర్వాత కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉందట.