ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (11:22 IST)

ఊ అంటావా... ఉఊ అంటావా: సమంత దారెటు?

Samanta
నటించడం మామూలే, కానీ కొంతమంది మాత్రమే పాత్రలో జీవిస్తారు. అలాంటివారిలో సమంత ఒకరు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి జీవించేస్తుంది సమంత. ఈ మధ్యనే పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ తో కుర్రకారుకి కిక్కెంచింది సమంత. ప్రస్తుత యశోద, శాకుంతలం చిత్రాల్లో నటిస్తోంది.

 
ఇక అసలు విషయానికి వస్తే... సమంతకి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విపరీతంగా ఆఫర్లు వస్తున్నాయట. పుష్పలో ఊ.. అంటావా పాటకి సమంత నృత్యం చూసిన బాలీవుడ్ నిర్మాతలు ఆమెకి ఆఫర్లు ఇస్తామంటూ ఫోన్లు చేస్తున్నారట. ఇక్కడ వుండి అక్కడి ఆఫర్ల గురించి ఫోన్లలో చర్చించే బదులు అక్కడే ఓ ఇల్లు కొనుక్కుని వాటి సంగతి చూస్తే బాగుంటుందని శామ్ అనుకుంటుందట.

 
తన మనసులోని మాటను బి.టౌన్ క్లోజ్ హీరోయిన్ కు చెప్పిందట సమంత. వెంటనే సదరు హీరోయిన్ సమంత కోసం సముద్రం ఒడ్డున మంచి లోకేషన్లో ఇంటిని కొనుగోలు చేసి పెట్టేందుకు సిద్ధమైందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే సమంత త్వరలో బాలీవుడ్‌కి షిప్ట్ అయిపోతుందట.