సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 మే 2017 (11:21 IST)

చలపతిరావు కామెంట్స్‌పై సమ్మూ నోరెత్తలేదే? చైతూ సినిమా ఫంక్షన్ కావడంతో?

టాలీవుడ్ సెలబ్రిటీలు చలపతిరావు చేసిన కామెంట్స్‌‌‌పై సమంత నోరెత్తకపోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. చలపతిరావు కామెంట్స్‌పై స్పందించకపో

టాలీవుడ్ సెలబ్రిటీలు చలపతిరావు చేసిన కామెంట్స్‌‌‌పై సమంత నోరెత్తకపోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. చలపతిరావు కామెంట్స్‌పై స్పందించకపోవడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. గతంలో మహేశ్ బాబు- సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన నేనొక్కడినే పోస్టర్ విషయంలో ఆడవాళ్లని అవమానించారంటూ సమంత స్పందించింది. 
 
అప్పట్లో మహేష్ ఫ్యాన్స్ నుంచి సమంత తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇదే తరహాలో పలు అంశాలపై సోషల్ మీడియాలో సమంత స్పందించింది. కానీ తాజాగా సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించినా.. సమంత స్పందించకపోవడం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సమంత చలపతిరావు చేసిన కామెంట్ మీద రియాక్ట్ కాలేదంటే కేవలం నాగ చైతన్య సినిమా ఫంక్షన్‌లో ఈ వివాదం జరగడమే కారణమా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.