గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2016 (13:43 IST)

సమంతతో వ్యాపారం చేయనున్న నితిన్.. నీరజ కోన కూడా పార్ట్‌నర్‌గా?

అందాల భామ సమంతతో కలిసి లవర్ బాయ్ నితిన్ వ్యాపారం మొదలెట్టనున్నాడు. యంగ్ హీరో, హీరోయిన్స్ ప్రస్తుతం వ్యాపారంపై అధిక శ్రద్ధ పెడుతున్న నేపథ్యంలో.. నితిన్ టీ- గ్రిల్ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించబోతున్న

అందాల భామ సమంతతో కలిసి లవర్ బాయ్ నితిన్ వ్యాపారం మొదలెట్టనున్నాడు. యంగ్ హీరో, హీరోయిన్స్ ప్రస్తుతం వ్యాపారంపై అధిక శ్రద్ధ పెడుతున్న నేపథ్యంలో.. నితిన్ టీ- గ్రిల్ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నాడు. ఈ వ్యాపారంలో సమంతతో చేతులు కలపాలని నితిన్ భావిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అ..ఆ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమా సందర్భంగా ఏర్పడిన స్నేహంతోనే సమంతను వ్యాపారంలో చేతులు కలపాల్సిందిగా కోరాడని అందుకు సమ్మూ కూడా ఓకే చెప్పేసిందని టాక్ వస్తోంది. 
 
ఈ రెస్టారెంట్ బిజినెస్‌లో టాప్ కాస్ట్యూమ్ డిజైనర్, సమ్మూ స్నేహితురాలు నీరజ కోన, నితిన్‌కి పార్ట్‌నర్‌గా ఉంటారని తెలుస్తోంది. పలువురు ప్రముఖులు ఈ రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నితిన్ సినిమాల విషయానికి వస్తే హను రాఘవపూడి దర్వకత్వంలో ఓ సినిమా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే.