సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2016 (12:34 IST)

కథ బాగుంటే హీరో ఎవరైతే నాకేంటి... ఆ హీరోతో ఆ పని చేసేందుకు సమంత ఒప్పేసుకుంది

టాలీవుడ్ హీరోయిన్ సమంతా తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే తమిళంలో కూడా సినిమాలు ఒప్పుకుంటుంది. పెద్దహీరో, చిన్నహీరో అనే తేడాలేకుండా ఎవరితోనైనా నటించేందుకు సై అంటోందీ కుందనపు బొమ్మ. తమిళంలో విక్రమ్, విజయ

టాలీవుడ్ హీరోయిన్ సమంతా తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే తమిళంలో కూడా సినిమాలు ఒప్పుకుంటుంది. పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడాలేకుండా ఎవరితోనైనా నటించేందుకు సై అంటోందీ కుందనపు బొమ్మ. తమిళంలో విక్రమ్, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా చలామణియైన ఈ భామ ఓ యువ హీరోతో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 
 
యువ హీరో శివకార్తికేయన్‌ తదుపరి చిత్రంలో సమంత హీరోయిన్‌గా ఎంపికైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రజినీమురుగన్‌ సినిమా తర్వాత కార్తికేయన్ నటిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు పోన్ రాం దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. సమంత ఈ కథ విన్న వెంటనే ఓకే చెప్పినట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
కథ, తన పాత్ర నచ్చడంతో హీరో ఎవరన్నది ఆమె అంతగా పట్టించుకోలేదట. తన సినిమాకు సమంత ఓకే చెప్పేయడంతో హీరో శివకార్తికేయన్ కూడా ఫుల్ ఖుషిఖుషీగా ఉన్నాడట. '24 ఏఎం స్టూడియోస్' సంస్థ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్న సమంత అనంతరం ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటుందని సినీపండితులు అంటున్నారు.