సమంతకు హీరోయిన్ ఛాన్సులు నిల్.. ఇక తట్టా బుట్టా సర్దేస్తుందా?
అక్కినేని నాగార్జునకు కోడలు కానున్న సమంతకు హీరోయిన్ ఛాన్సులు రావట్లేదు. నాగచైతన్యతో ప్రేమాయణం కాస్త పెళ్లి వరకు రావడంతో సమంత త్వరలోనే పెళ్లి కూతురు కానుంది. సమంతకు పెళ్లికానుందనే వార్త రాగానే నిర్మాతల
అక్కినేని నాగార్జునకు కోడలు కానున్న సమంతకు హీరోయిన్ ఛాన్సులు రావట్లేదు. నాగచైతన్యతో ప్రేమాయణం కాస్త పెళ్లి వరకు రావడంతో సమంత త్వరలోనే పెళ్లి కూతురు కానుంది. సమంతకు పెళ్లికానుందనే వార్త రాగానే నిర్మాతలు, దర్శకులు సమంతకు ఛాన్సిచ్చేందుకు ముందుకు రావట్లేదు. దీంతో తక్కువ సమయంలో టాప్ హీరోయిన్‌గా మారిన సమంత ఇక హీరోయిన్ రోల్స్‌కి గుడ్ బై చెప్పేస్తుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది తారక్‌తో చేసిన జనతా గ్యారేజ్ తర్వాత సమంత తెలుగులో హీరోయిన్‌గా మరో సినిమా చేయలేదు. కానీ చెర్రీ- సుకుమార్ కాంబోలో సమంత హీరోయిన్ రోల్ పోషించింది. ఇదే సినిమానే సమంతకు హీరోయిన్‌గా చివరి సినిమా అని టాలీవుడ్ జనం అంటున్నారు.
ఎందుకంటే.. చాలా గ్యాప్ తరువాత రీసెంట్‌గా సమంత సైన్ చేసిన 'రాజుగారి గది 2', 'సావిత్రి' సినిమాల్లో సమంత లీడ్ రోల్ చేయడం లేదు. కాబోయే మామ నాగార్జునతో చేస్తున్న 'రాజుగారి గది2'లో సమంత ఓ స్పెషల్ రోల్ చేస్తోంది. అలాగే.. అలనాటి మహానటి 'సావిత్రి' బయోపిక్‌లో కూడా సమంత స్పెషల్ రోల్ మాత్రమే చేస్తోంది. సావిత్రిగా లీడ్ రోల్‌లో యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది.
ఇకపోతే తాజాగా సమంత మరో సినిమాలోనూ స్పెషల్ రోల్ చేసేందుకు రెడీ అవుతోంది. అలాగే 'జ్యో అచ్యుతానందా' తరువాత నాగశౌర్య చేయబోయే న్యూ మూవీలో సమంత స్పెషల్ రోల్ చేస్తోందట. 'అమ్మమ్మగారి ఇల్లు' టైటిల్‌తో తెరకెక్కబోయే మూవీలోనూ సమంత స్పెషల్ రోల్ పోషించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.