శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (18:55 IST)

అందాల హీరో అరవింద్ స్వామితో శ్రియ రొమాన్స్..? నెగటివ్ రోల్ చేస్తుందట..?

గౌతమీ పుత్ర శాతకర్ణికి తర్వాత శ్రియకు మంచి ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. శాతకర్ణికి ముందు కెరీర్‌ పరంగా ఈ సీనియర్ నటికి కొంత గ్యాప్ వచ్చినా.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తన వయస్సుకు తగిన పాత్రలు

గౌతమీ పుత్ర శాతకర్ణికి తర్వాత శ్రియకు మంచి ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. శాతకర్ణికి ముందు కెరీర్‌ పరంగా ఈ సీనియర్ నటికి కొంత గ్యాప్ వచ్చినా.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తన వయస్సుకు తగిన పాత్రలు చేసుకుంటూ పోతోంది. బాలయ్యతో శాతకర్ణికి తర్వాత ఆయన 101 సినిమాలోనూ శ్రియనే నటిస్తోంది. అలాగే కృష్ణవంశీ ''నక్షత్రం'' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. 
 
ఇదేవిధంగా తమిళంలో ధ్రువంగల్ పదినారు సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన యంగ్ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించే రెండో సినిమా ''నరకాసురన్‌''లో శ్రియ హీరోయిన్ ఛాన్సును సొంతం చేసుకుంది. ఇందులో  సీనియర్ నటుడు అరవింద్ స్వామికి జోడీగా శ్రియ నటిస్తుందట. శ్రియది ఇందులో నెగటివ్ రోల్ అంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.