ఆ వ్యక్తి నా లవర్ కాదు... స్నేహితుడే : నటి శృతిహాసన్
తన అందచందాలతో సినీ అభిమానులను పిచ్చెక్కిస్తున్న శృతిహాసన్ తాజాగా ఓ యువకుడితో శృతిహాసన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. కొద్ది రోజులుగా ఓ ఫారిన్ నటుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లో నిలిచింద
తన అందచందాలతో సినీ అభిమానులను పిచ్చెక్కిస్తున్న శృతిహాసన్ తాజాగా ఓ యువకుడితో శృతిహాసన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. కొద్ది రోజులుగా ఓ ఫారిన్ నటుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లో నిలిచింది. ఇటలీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్‌తో శ్రుతి ప్రేమలో పడిందని ఆ వార్తల సారాంశం. వేలంటైన్స్ డే రోజును వారిద్దరూ భారత్‌లో కలిసి జరుపుకున్నారంటూ ఆన్‌లైన్‌లో వైరల్ అయిన ఇద్దరి ఫోటోలతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిపోయింది. దీనిపై టాలీవుడ్‌తో పాటు.... కోలీవుడ్‌తో పెద్ద రచ్చే జరుగుతోంది.
దీనిపై శృతిహాసన్ స్పందించింది. మైఖేల్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని, అంతకుమించి ఏమీ లేదని స్పష్టం చేసింది. నటీనటులపై ఇటువంటి వదంతులు సహజమని, వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని వ్యాఖ్యానించింది. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ... ‘సి3’లో తన పాత్రకు మంచి గుర్తింపు లభించిందని, నటనకు ప్రాధాన్యమున్న ఈ తరహా పాత్రల్లో నటించడాన్ని తాను ఎంతో ఇష్టపడతానని చెప్పింది.