శనివారం, 2 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (13:23 IST)

చీర కట్టినా ఆ కోణంలో చూస్తే ఎలా: నటి వాణి భోజన్ ప్రశ్న

vani bhojan
చీర కట్టుకున్నప్పటికీ తనను గ్లామర్ కోణంలోనే చూస్తున్నారని సినీ నటి వాణి భోజన్ వాపోతున్నారు. తాను ఎంత చీరకట్టులోనూ అంత సెక్సీగా కనిపిస్తున్నానా? అని ప్రశ్నిస్తున్నారు. 
 
బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్‌కు వచ్చిన హీరోయిన్ వాణీ భోజన్. చక్కటి అభినయం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆమెకు సినిమా అవకాశాలు రాలేదు. దీంతో సినిమా అవకాశాల కోసం అవసరమైతే గ్లామర్‌గా నటించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. 
 
దీనిపై వాణి భోజన్‌ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా వాణి భోజన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత గ్లామర్‌గా నటించడంలో తప్పు లేదన్నారు. కానీ, హద్దులు దాటకూడదన్నారు. పైగా, తాను సాధారణ చీర కట్టుకున్నా, సెక్సీగా కనిపిస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారని, కాలంతోపాటు మనలోని ఆలోచనలు కూడా మారాలని ఆమె కోరారు.