శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (15:18 IST)

జిన్నా నుంచి సన్నీలియోన్ స్టిల్ విడుద‌ల‌

Sunny Leone
Sunny Leone
మంచు మ‌నోజ్ గ‌తంలో న‌టించిన క‌రెంట్ సినిమాలో సన్నీలియోన్ ఓ పాత్ర పోషించింది. ఇప్పుడు మంచు విష్ణు న‌టిస్తున్న `జిన్నా` చిత్రంలో ఆమె న‌టిస్తోంది. బుధ‌వారంనాడు ఆమెకు సంబంధించిన  స్టిల్ విడుద‌ల చేసింది చిత్ర బృందం.
 
యాక్షన్ రొమాంటిక్ కామెడీ నేప‌థ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రేణుక గా పరిచయం చేస్తున్నామ‌ని తెలియ‌జేశారు. ఈషన్ సూర్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్‌.రాస్తున్నారు, ఆయన గతంలో విష్ణు నటించిన  ఢీ, 'దేనికైనా రెడి' చిత్రాలకు స్క్రిప్ట్‌లు అందించారు.
అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.