శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (18:07 IST)

ప్రకాష్ రాజ్ ప్యానెల్ "మా" సభ్యుల రాజీనామాలు ఆమోదం

తెలుగు చిత్రపరిశ్రమలోని బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజుకు ఆయన ఒక వినతి పత్రం అందజేశారు. ఇందులో సినిమా నిర్మాణ పనులు, పాత్రలకు మా సభ్యులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. 
 
ఇదిలావుంటే, తాజాగా మంచు విష్ణు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీకాంత్, ఉత్తేజ్ సహా మొత్తం 11 మంది కార్యవర్గ సభ్యులు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను మంచు విష్ణు తాజాగా ఆమోదించారు. నిజానికి ఈ రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని మంచు విష్ణు పలుమార్లు కోరారు. కానీ, వారు ఏమాత్రం వెనక్కితగ్గలేదు. దీంతో రాజీనామాలపై ఆమోదముద్ర వేశారు.