ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీ.వీ.
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (19:34 IST)

రాఖి సావంత్ చీప్ కామెంట్స్ కు కేసు పెట్టిన తను శ్రీ దత్తా!

Rakhi-Tanusri
Rakhi-Tanusri
బాలీవుడ్‌ నటి తను శ్రీ దత్తా, హాట్‌ నటి రాఖీ సావంత్‌ పై కేసు పెట్టింది. తన గురించి పలు వీడియోలు చేసిన రాఖీసావంత్‌, బేస్‌లెస్‌ ఆరోపణలు చేసిందనిదీనిపై సొసైటీలో తన ఇమేజ్‌ దెబ్బతిన్నదని వాపోయింది. దానివల్ల చాలా పెయిన్‌ అనుభవించానని అంటోంది. కానీ ఆ తర్వాత క్షమాపణలు చెప్తూ రాఖీ సావంత్‌ ఓ వీడియో చేసింది. కానీ అది జెన్యూన్‌గా లేదని తనుశ్రీ దత్తా చెబుతోంది.

ఒక స్త్రీ గురించి మరో నటి ఇలా చేయడం బాధాకరమైందని అంటోంది. ఇలాంటి వరస్ట్ వీడియో మంచిది కాదని వాపోతుంది. దీనిపై తనుశ్రీ దత్తా లాయర్‌ మాట్లాడుతూ, రాఖీ వెనుక అసలు వ్యక్తులు ఎవరో వున్నారనీ, వారు ఖచ్చితంగా అరెస్ట్‌ చేయబడతారని అంటున్నారు. ఇది మరోసారి మరో నటికి రిపీట్‌ కాకుండావుంటుందని చెబుతున్నారు.
కాస్టింగ్ కోచ్ విషయాలు, డ్రగ్స్ వంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని పలువురు రాఖీకి క్లాస్ పీకుతున్నారు.