శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By IVR
Last Updated : శుక్రవారం, 11 జులై 2014 (21:37 IST)

'దృశ్యం' రిపీట్‌... ఫ్లోరిడాలో డైరెక్టర్ కుమార్తెకు వేధింపులు... కుర్రాడిది 'కడప'ట...

వెంకటేష్ నటించిన 'దృశ్యం' సినిమాలో కీ పాయింట్‌. అతని కుమార్తెను ఓ యువకుడు వేధించడమే. ఈ సంఘటనలు చాలాచోట్ల జరుగుతున్నాయి. అందుకే ఈ పాయింట్‌ హాట్‌ టాపిక్‌. అలాంటి ఘటనే విదేశాల్లో జరిగింది. అంటే.. అది ఇండస్ట్రీకి సంబంధించి కావడమే. ఫ్లోరిడాలో తెలుగు చిత్ర దర్శకుడు కుమార్తె చదువుకుంటోంది.
 
అక్కడ ఓ యువకుడు ఆమెను టార్చెర్‌ పెడుతున్నాడు. ఆ అమ్మాయి తండ్రికి చెప్పడంతో.. జూబ్లీహిల్స్‌లో కేసు బుక్‌ చేశాడట. ఇంతకీ వేధించే వ్యక్తి కూడా తెలుగువాడే. కడపలో ఉండే ప్రణీత్‌ అని తేలింది. ఈ విషయం కుర్రాడి కుటుంబానికి తెలవడంతో... షాక్‌ అయ్యాడు.
 
వెంటనే క్షమాపణ చెప్పాడట. ఇది ఫిలింనగర్‌ పెద్ద టాపిక్‌గా మారింది ఈరోజు. ఇక ఆ దర్శకుడు ఎవరనేది రకరాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరనేది త్వరలో తెలుస్తుంది. పోలీసులు ఈ విషయాన్ని మీడియాకు వివరించలేదు.