సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (09:45 IST)

ట్రెండింగ్ లో పిల్ల మొగ్గ. అంటూ భగవంత్‌ కేసరి వాడిన పవర్ ఫుల్ డైలాగ్‌లు

kesari- balayya
kesari- balayya
బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి ట్రైలర్‌ వరంగల్‌లోని హనుమండలో విడుదలయింది. నిన్న రాత్రి జరిగిన ఈవెంట్‌లో నటుడు రచ్చరవి బాలయ్యను దేవుడులెక్క పోల్చాడు. దేవుడు తిడతాడు. కొడతాడు. అది ఇద్దరికీ తెలుసు. బయటవారికి అవసరంలేదంటూ పొగిడిన ఆయన ట్రైలర్‌ చూస్తే ఎందుకు అలా అన్నాడో అర్థమవుతుంది. ట్రైలర్‌లో దేవుడు గురించి డైలాగ్‌లూ వున్నాయి.
 
ట్రైలర్‌లో.. తన బిడ్డ (శ్రీలీల)కు మిలట్రీ ట్రైనింగ్‌ ఇప్పింస్తుంటాడు బాలయ్య. ట్రైనింగ్‌ కష్టాన్ని భరించలేకపోతుంది. అప్పుడు బాలయ్య.. బిడ్డను స్ట్రాంగ్‌ చేయాలి. ఛైర్‌ లెక్క అంటాడు. ఇక బాలయ్యపై కొందరు రౌడీలు ఎటాక్‌ చేస్తే ఇరగదీస్తాడు. మిమ్మల్ని పంపిన కొడుకు ఎవడో తెలియాలి.. అంటూ డైలాగ్‌ వదులుతాడు. ఇక మెయిన్‌ విలన్‌.. నన్ను కొట్టే బలవంతుడుని ఆ భగవంతుడు కూడా తేలేడు అంటూ సవాల్‌ విసురుతాడు.. వెంటనే.. దేవుడు ఎవడ్రా.. దేవుడు ఎవడు.. చప్పుడు చేయ్‌క పిల్ల మొగ్గ..అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. ఇలా ఆవేశపూరితంగా సవాల్‌ ప్రతిసవాల్‌తో కూడిన ఈ డైలాగ్‌లు వర్తమాన రాజకీయాలకు సంబంధించినవిగా అనిపిస్తున్నాయి. 
 
గతంలో అఖండ సినిమాలోని సన్నివేశాలు ఆంధ్రరాష్ట్రంలో దేవాలయాన్ని భ్రష్టుపట్టిస్తున్న ప్రభుత్వంపై సెటైర్‌గా వున్నాయి. దాన్ని బాలయ్య కూడా ఒప్పుకున్నాడు. మరి ఈ భగవంత్‌ కేసరి ట్రైలర్‌ చూస్తే ఒక అడుగు ముందుకు వేసినట్లుంది. సినిమా విడుదలయ్యాక ఏ రేంజ్‌లో వుంటుందో చూడాలి.