గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 18 మే 2017 (07:25 IST)

ఆయన అందగాడు.. ఈయన సోదరుడు.. ఒక్కమాటలో తానెటువైపో తేల్చిపడేసిన అనుష్క

బాహుబలి-2 ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో దేశవ్యాప్తంగా పర్యటించిన అనుష్క ప్రభాస్‌ను ఎంత జాగ్రత్తగా చూసుకుందో వీడియా సాక్షిగా తెలిసిపోయింది. అలాగే మహా బిడియస్తుడిగా పేరుపడిన ప్రభాస్ అయితే అనుష్క పర్సనల్ మొబైల్ తీసుకుని బ్రౌజ్ చేసేటంత సాన్నిహిత్యం ఆమెపట్

‘బాహుబలి-2’ కలెక్షన్ల పరంగా ఎంత రికార్డు సృష్టించిందో.. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులు కూడా అదే స్థాయిలో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కానీ అభిమానులను, ప్రజలను మహాశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే బాహుబలి-2 ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో దేశవ్యాప్తంగా పర్యటించిన  అనుష్క ప్రభాస్‌ను ఎంత జాగ్రత్తగా చూసుకుందో వీడియా సాక్షిగా తెలిసిపోయింది. అలాగే మహా బిడియస్తుడిగా పేరుపడిన ప్రభాస్ అయితే అనుష్క పర్సనల్ మొబైల్ తీసుకుని బ్రౌజ్ చేసేటంత సాన్నిహిత్యం ఆమెపట్ల ప్రదర్సించాడు. ఇక బాహుబలి-2 విడుదలయ్యాక చూసిన జనాలకు మతిపోయింది. ఈ ప్రపంచంలోనే క్యూటెస్ట్ పెయిర్‌గా ప్రేక్షకులు వందశాతం ఓటేశారు. అమరేంద్ర బాహుబలి, దేవసేన పాత్రల్లో వారెంత ఒదిగిపోయరంటే నిజజీవితంలో కూడా వారు దంపతులే అన్నంత టాక్ సంపాదించేశారు. సినిమాలో ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
 
 
ఈ నేపథ్యంలో అనుష్క, ప్రభాస్‌పై చేసిన కామెంట్స్ అభిమానుల ఆశలకు ప్రాణంపోసినట్లుగా ఉన్నాయనే చెప్పాలి. బాహుబలి-2 సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుష్క.. ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాహుబలి సినిమాలో కో స్టార్స్‌గా నటించిన ప్రభాస్, రానా.. వీరిద్దరిలో ఎవరు అందగాడు.. అని ఇంటర్వూ చేస్తున్న యాంకర్ ప్రశ్నించగా.. ఏమాత్రం తడుముకోకుండా ప్రభాస్ అని టకీమని చెప్పేసింది అనుష్క. మరి రానా సంగతేంటి అని ప్రశ్నించగా.. రానా తనకు సోదరుడిలాంటి వాడని చెప్పింది. రానాను బ్రదర్ అని పిలుస్తానని, రానా కూడా తనను సిస్టర్‌లాగా చూస్తాడని చెప్పుకొచ్చింది. 
 
ఇవన్నీ పక్కన పెట్టి చూసినా కొంతకాలంగా ప్రభాస్, అనుష్క మధ్య ఏదో ఉందని, అత్యంత రహస్యంగా వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ నడుస్తోందని ఒకరికొకరు సరైన జోడీగా ఉన్నారు కాబట్టి ఇద్దరూ వివాహబంధం ద్వారా ఒక్కటైతే బాగుంటుందని ప్రభాస్ అభిమానులందరూ భావిస్తున్నారు.