బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 7 మే 2016 (14:23 IST)

వెంకటేష్ 75వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం...

వెంకటేష్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ''బాబు బంగారం''. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో 73వ చిత్రం. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎన్నో హిట్ సినిమాలలో నటించి అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను మెప్పించాడు. ''బాబు బంగారం'' ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఈ సినిమాను ఎట్టకేలకు జూలైలో విడుదల చేయాలని వెంకటేష్ భావిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేష్ మరో సినిమాను ప్రారంభించనున్నాడు. 
 
ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ 74వ చిత్రం ప్రారంభం కాకుండానే వెంకటేష్ తన 75వ సినిమా స్క్రిప్ట్ విషయమై తీవ్ర ఆలోచనలో ఉన్నాడని ఫిలిం వర్గాలు అంటున్నాయి. వెంకీ 75వ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. 
 
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కళ్యాణ్ రామ్‌తో ఒక సినిమాను చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమా పూర్తి అయిన వెంటనే పూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా చేస్తుండగా, బాలకృష్ణ 100వ సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో విక్టరీ వెంకటేశ్ 75వ సినిమాకి భారీ అంచనాలు నెలకొంటున్నాయి.