గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 16 జులై 2017 (16:02 IST)

సినిమా ప్లాప్ అయితే గదిలో కూర్చొని ఏడ్చేస్తా : విద్యాబాలన్

తాను నటించిన ఓ చిత్రం ప్లాప్ అయితే గదిలో కూర్చొని వెక్కివెక్కి ఏడుస్తానని బాలీవుడ్ నటి విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఇదే అంశంపై ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను నటించిన సినిమా ప్లాప్ అయితే స

తాను నటించిన ఓ చిత్రం ప్లాప్ అయితే గదిలో కూర్చొని వెక్కివెక్కి ఏడుస్తానని బాలీవుడ్ నటి విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఇదే అంశంపై ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను నటించిన సినిమా ప్లాప్ అయితే సైలెంట్‌గా ఉండనని, ఏడ్చేస్తానని చెప్పుకొచ్చింది. 
 
తమ సినిమా ప్లాప్ అయితే, నటీనటులు బాధపడుతుండటం సహజమేనని అన్నారు. అయితే, సినిమా ప్లాప్ అయిందని చెప్పి ఓ గదిలో మౌనంగా కూర్చోనని, ఆ సమయంలో తనతో మాట్లాడేందుకు ఒకరు ఉండాలని చెప్పింది. 
 
ముఖ్యంగా తన తల్లిదండ్రులు లేదా తన భర్తతో మాట్లాడతానని, కొంచెం సేపు ఏడ్చిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తానని విద్యాబాలన్ చెప్పింది. అయితే, తాను నటించిన సినిమా ప్లాప్ అయితే పడే బాధ  ప్రభావాన్ని, తాను నటించబోయే చిత్రంపై ఏమాత్రం చూపించనని చెప్పింది.