సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (09:45 IST)

గాసిప్ మేకర్స్ నన్ను ప్రతినెలా ప్రెగ్నెంట్‌ని చేశారు..విద్యాబాలన్

రాజకీయ సినిమాపై ఇటీవల బాలీవుడ్‌ భామ విద్యాబాలన్‌ స్పందించింది. రాజకీయ నేపథ్యంలో సినిమా చేయాలని వుందనీ, అయితే అది రాజకీయ పార్టీల్ని ప్రమోట్‌ చేసేలాగానో, రాజకీయ పార్టీల్ని విమర్శించేలాగానో వుండకూడదని షర

రాజకీయ సినిమాపై ఇటీవల బాలీవుడ్‌ భామ విద్యాబాలన్‌ స్పందించింది. రాజకీయ నేపథ్యంలో సినిమా చేయాలని వుందనీ, అయితే అది రాజకీయ పార్టీల్ని ప్రమోట్‌ చేసేలాగానో, రాజకీయ పార్టీల్ని విమర్శించేలాగానో వుండకూడదని షరతులు పెట్టింది.

ఈ నేపథ్యంలో ఎప్పుడూ బోల్డ్‌గా మాట్లాడే విద్యాబాలన్ సినిమాల్లోనూ బోల్డ్‌గా నటిస్తుంది. నాలుగేళ్ల క్రితం ఫిల్మ్ ప్రొడ్యూసర్‌ సిద్ధార్థ్ రాయ్‌ కపూర్‌ను విద్యాబాలన్‌ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల ఆమె వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయన్న రూమర్స్ సినీ సర్కిల్స్‌లో గుప్పుమన్నాయి.
 
దీనిపై విద్యాబాలన్‌ తనదైన స్టైల్‌లో క్లారిటీ ఇచ్చారు. సిద్ధార్థ్‌‌తో తనకెలాంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఇంకా తన ప్రెగ్నెన్సీపై కూడా ఇలాంటి రూమర్స్ క్రియేట్‌ చేశారని చెప్పుకొచ్చారు. గాసిప్ మేకర్స్ నన్ను ప్రతినెలా ప్రెగ్నెంట్‌ని చేశారు అంటూ చెప్పుకొచ్చారు. మొదట్లో ఇలాంటి రూమర్స్ విషయంలో కాస్త బాధపడేదానినని అయితే వాటిని ఆపై పట్టించుకోవడం మానేశానని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.