మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By SELVI.M

మమత "మోహనం"గా బొడ్డు కింద టాట్టూ...

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం మనుగడ సాగించాలని భావించే హీరోయిన్లు అంగాంగ ప్రదర్శనలకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 

పాతతరంలో ఇందుకోసం కొంతమంది సెక్సీ హీరోయిన్లు ఉండేవారు. అయితే, ప్రస్తుతం ఆ పాత్రలను కూడా రెగ్యులర్ హీరోయిన్లు పోషిస్తున్నారు. దీంతో నిర్మాతలకు శ్రమతో పాటు.. ఖర్చు కూడా తగ్గుతోంది.

ముఖ్యంగా.. తెలుగులో పొడవుకాళ్ల సుందరిగా పేరొందిన త్రిష టాట్టూ (పచ్చబొట్టు)ని ఎదపై వేయించుకుంటే.. కొందరు భాచితపైనా, మరికొందరు బొడ్డుపైనా వేసుకున్నారు. ఈ జాబితాలో మమతామోహన్‌దాస్ కూడా తాజాగా చేరింది.

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం రమ్మీలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈ చిత్రంలో అందాలను ఆరబోసేందుకు మమతా పోటీ పడుతోందట. అంతేకాదు.. టాట్టూను బొడ్డుకింద వేయించుకుని గ్లామర్‌ను ప్రదర్శిస్తుందని సినీ వర్గాల్లో టాక్. మరి అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందోనని వేచి చూడాల్సిందే.

ముఖ్యంగా.. తెలుగులో నటించే హీరోయిన్ల మధ్య ఎక్కువగా పోటీ నెలకొనివుంది. దీంతో పదహారణాల తెలుగు ముద్దుగుమ్మలు సైతం పోటీ పడుతున్నారు.