మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

స్కిన్ షో చేయనుగాక చేయను: స్నేహ

గ్లామర్ ఫీల్డులో గ్లామర్ అంటే చాలా అర్థాలున్నాయి. అందంగా ఉండటం, బికినీలు వేసుకుని మరింత అందాన్ని చూపెట్టడం అంటూ పలు విధాలుగా ఉన్నాయి. స్నేహ దృష్టిలో మాత్రం గ్లామర్ అంటే చర్మ సౌందర్యం కాదు. చూడగానే బాగుంది అనిపించాలంటోంది. 

ఇటీవల తాను బికినీలో నటిస్తున్నాననీ, దానికి మించిన అందం ఏముందని అని తన గురించి ఓ తమిళ దర్శకుడు అన్న మాటపై ఆమె స్పందించింది. ఏదో స్కిన్ షో చేసేది గ్లామర్ కాదని అంటోంది. తానెప్పుడూ డబ్బుకోసం కక్కుర్తి పడలేదనీ, ఇక ముందు కూడా పడబోననీ అంటోంది.

స్నేహ ఎందుకిలా చేసింది అని అభిమానులను నొప్పించననీ, ఇంటిల్లిపాది చూసే విధంగా యూత్‌ను ఆకట్టుకునేవిధంగా నా డ్రెస్‌లు సినిమాలుంటాయని చెబుతోంది. తాజాగా ఆమె భవానీ ఐపీఎస్ అనే తెలుగు, తమిళ చిత్రంలో నటిస్తోంది. అందులోనూ ఓ సందర్భంలో టైట్ దుస్తులు ధరిస్తుంది. ఆ సినిమా విడుదలయితే కానీ స్నేహ స్కిన్ షో ఎంతమేరకు ఉంటుందో చెప్పలేం.