ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Hanumantha Reddy
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2015 (16:25 IST)

తెలుగు బేసిక్ ఇన్‌స్టింక్ట్స్‌లో ముమైత్

హాలీవుడ్‌లో వివాస్పద సంచలనం సృష్టించిన చిత్రం బేసిక్ ఇన్‌స్టింక్ట్స్‌‌. ఈ చిత్రంలో షరాన్ స్టోన్ తన వయ్యారాలతో శృంగారాన్ని ఒలకబోస్తూ అద్భుత నటనతో కుర్రకారును వెర్రెత్తించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో మరో శృంగార తార ముమైత్‌ఖాన్‌ను పెట్టి తయాలనుకుంటున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు వెల్లడించాయి.

కథ హాలీవుడ్‌దే అయినప్పటికీ తెలుగులో మాత్రం భారతీయత ఉట్టిపడేలా తీయనున్నట్లు భోగట్టా. మైసమ్మ ఐపీస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డప్పటికీ ముమైత్‌లో ఇంకా సత్తా తగ్గలేదని.. ఆమె అంటే అభిమానులు ఎగబడుతారని నిర్మాతలు అంచనా వేస్తున్నారు.

కాగా, హాలీవుడ్‌లో వివాస్పదమైన ఈ చిత్ర కథలో సీరియల్ హత్యల్లో ప్రధాన పాత్ర పోషించిన ఓ బైసెక్సువల్ శృంగార రచయితను ఓ పోలీసు ఆఫీసర్ ఇంటరాగేట్ చేయడానికి ఆమె కోసం ప్రయత్నిస్తాడు. ఈలోగా ఆమె ప్రేమలో పడిపయి, ఆమె మత్తులో పూర్తిగా మునిగిపోతాడు.. ఏదైతేనేం... సినిమా కదా... చివరికి రహస్యాన్ని ఛేదిస్తాడు.. ఆ పోలీసు ఆఫీసర్.. అదీ కథ...