శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (13:58 IST)

1000 వాలా చిత్రం టీం వర్క్ చాలా ముచ్చట వేసింది : సుమన్

Suman, amith and others
Suman, amith and others
అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. యువ దర్శకుడు అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నటులు సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  అతిథుల సమక్షంలో ఈ చిత్ర యూనిట్ ఫ్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. ముఖ్య అతిధి గా వచ్చిన హీరో సుమన్ ట్రైలర్ లాంచ్ చేశారు.యాంకర్ స్వప్న చౌదరి అమ్మినేని మాటల తో ప్రేక్షకులను అలరించింది.
 
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, ఈ సినిమా మొత్తం చాలా ఉత్సాహన్ని ఇచ్చింది. షూటింగ్ లోకేషన్ లో సైతం వీళ్ళ టీం వర్క్ చూసి చాలా ముచ్చట వేసింది.సినిమా చాలా బాగా వచ్చింది టీం అందరికి శుభాకాంక్షలు, హిరో కి, డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.
 
మరొక అతిధి మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి యాంగ్ టీం చిత్ర పరిశ్రమ కి ఎంతో అవసరం అని, 1000 వాలా చిత్రం సూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు.
 
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా నా ప్రయాణం మొదలైనది, ఇలాంటి కంటెంట్ ఉన్న సినమా ని ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారు. సుమారు 280 థియేటర్లలో విడుదల చేయడానికి నేను వీరికి తోడుగా ఉంటాను అని సభాముఖంగా చెబుతున్నాను అని అన్నారు.
 
హీరో అమిత్ మాట్లాడుతూ, హీరో అవ్వాలి అనేది నా 10 ఏళ్ల కళ, కష్టాలు చూసి, బాధ చూసాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, తిండి తినకుండా ప్రయత్నాలు చేసా, ఎలాంటి సపోర్ట్ లేకుండా  ఫిల్మ్ ఇండస్ట్రీలో కి ఎంటర్ అయ్యాను, నా డైరెక్టర్ అఫ్జల్, నిర్మాత షారుఖ్ ల వలన ఈ సినిమా మొదలు పెట్టాం, చాలా మంచి అవుట్పుట్ వచ్చింది.
 
దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "మా 1000 వాలా చిత్రం టీజర్  సోషల్ మీడియా ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనేక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సత్తా ఉన్న ఈ సినిమా అందరి అంచనాలను మించి తప్పక భారీ విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. ఈ కార్యక్రమంలో విడుదల చేసిన ట్రైలర్ కి సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇక్కడికి వచ్చిన అతిథులందరి పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మా ఒక్కరిది కాదు, సినిమా లో భాగంఐనా ప్రతి ఒక్కరిది ఈ సినిమా అని డైరెక్టర్ అఫ్జల్, నిర్మాత షారుక్ అన్నారు. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని చిత్ర బృందం తెలిపారు.